మీ చిన్న పిల్లలు కంటి సమస్యలతో బాధపడుతున్నారా… ఇప్పటికైనా మేల్కొని ఇలా ప్రయత్నించండి?

చిన్న వయసులోని కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కంటి సమస్యలకు ప్రధాన కారణాలు పోషకాహార లోపం, టీవీలు మొబైల్స్ ఎక్కువగా చూడడం, వాతావరణ కాలుష్యం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఎక్కువగా మొబైల్స్ ముందే గడుపుతున్నారు ఫలితంగా మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే ప్రమాదకర కాంతి కిరణాలు రేడియేషన్ ప్రభావం పిల్లల కళ్ళ పై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా కంటి చూపు మందగించి అనేక కంటి సమస్యలతో బాధపడుతున్నారు.

చిన్నపిల్లల కంటి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి లేదంటే పిల్లలు భవిష్యత్తులో కంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపిస్తే అనేక కంటి సమస్యలు తలెత్తుతాయి. కావున
పిల్లల శారీరక ,మానసిక పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు వంటి ఆహారాన్ని పిల్లల రోజువారి ఆహారంలో ఉన్నట్లు చూసుకోవాలి.

పిల్లలు తమ రోజువారి ఆహారంలో క్యారెట్ ను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది. క్యారెట్ జ్యూస్ రూపంలో అందిస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. అలాగే ప్రతిరోజు నారింజ లేదా బత్తాయి పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ, సి కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది.

బొప్పాయి పండ్లలో అత్యధికంగా విటమిన్ ఏ, సి ,డి , కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున పిల్లలు ప్రతిరోజు బొప్పాయిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడి ఎముకలు దృఢంగా తయారవుతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది కావున పిల్లలకు స్నాక్స్ రూపంలో ఉదయం సాయంత్రం కాసిన్ని గుమ్మడి గింజలను తినిపించడం మంచిది.

పోషకాహారాన్ని ఇవ్వడంతో పాటు చిన్నపిల్లల సున్నితమైన కంటి చూపును దెబ్బతీసే మొబైల్స్, కంప్యూటర్స్ ముందు ఎక్కువ సమయం గడపకుండా చూసుకోవాలి.