చిన్న వయసులోనే కంటి చూపులోపిస్తోందా? కారణాలు ఇవే కావచ్చు?

చిన్న వయసులోనే కంటి సమస్యలతో బాధపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహార లోపం ఒక కారణమైతే మరొక ముఖ్య కారణం రోజుల్లో ప్రతి చిన్న పనికి మొబైల్స్, కంప్యూటర్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ రోజంతా వీటి రేడియేషన్ ప్రభావం, బ్లూ లైట్ కారణంగా కంటిపై ఒత్తిడి పెరిగి అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది. ఫలితంగా కంట్లో నీరు కారడం, కళ్ళు ఎర్రబడడం, మంట, పొడి వారడం, కంటి చూపు లోపించడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని నియమాలు పాటిస్తే కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ , ఐరన్ పుష్కలంగా ఉండే చేపలు, ఆకుకూరలు, గుడ్లు, పండ్ల రసాలను మన రోజువారి ఆహారంలో తీసుకోవడంతోపాటు కంటికి సంబంధించిన ఎక్ససైజ్ లను కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే అనేక కంటి సమస్యలకు కారణం అయిన మొబైల్స్ కంప్యూటర్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ తో గడిపితే వీటినుంచి వెలుపడే రేడియేషన్ నీలి కాంతి కారణంగా కంటిపై ఒత్తిడి పెరిగి అనేక సమస్యలు తలెత్తుతాయి.

మొబైల్, కంప్యూటర్ చూస్తూ అర్ధరాత్రి వరకు నిద్రపోని వారిలో కళ్ళు పొడిబారడం, కళ్ళ వాపు, కంటి చుట్టూ నల్లని వలయాలు మనం గమనించవచ్చు. ఇదిలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కంటి సమస్యలు తలెత్తడంతో పాటు నిద్రలేమి సమస్య వల్ల మానసిక అనారోగ్యం సంభవిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కాంతి కిరణాల కారణంగా కంట్లో క్యాటరాక్ట్ పెరిగి పోయి కంటి చూపు మందగిస్తుంది. దీని నుంచి రక్షణ పొందడానికి బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. చేతులను శుభ్రం చేసుకోకుండా కంటిని తాగితే ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ లు కంటి అనారోగ్యానికి కారణం అవుతాయి. అందుకే చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం మంచిది.