ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వందేళ్లు బ్రతకొచ్చట.. ఏం చేయాలంటే?

ప్రతి మనిషికి 100 సంవత్సరాలు జీవించాలని ఉంటుంది. అయితే కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తుండటంతో మనిషి ఎక్కువ సంవత్సరాల పాటు జీవించడం సులువు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో మాత్రం మనుషులు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

సరైన జాగ్రత్తలు తీసుకుంటూ అలవాట్లను మార్చుకుంటే 100 సంవత్సరాలు జీవించడం కష్టం కాదు. 100 సంవత్సరాలు బ్రతకాలంటే సరైన ఆహారపు అలవాట్లు ఉండాలి. రుచిగా ఉండే వంటకాల కంటే ఆరోగ్యంగా ఉండే వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ చేయడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

కూరగాయలు, చేపలు ఎక్కువగా తీసుకుంటూ కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన లేకుండా జీవనం సాగిస్తే ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుంది. మనం కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసేవాళ్లు ఉంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా 100 సంవత్సరాల పాటు జీవనం సాగించవచ్చు.

చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు, ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ అలవాట్లను పాటిస్తే మాత్రం 100 సంవత్సరాల పాటు బ్రతకడం సులువేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.