శీతాకాలంలో వచ్చే అలర్జీలను తరిమికొట్టే అద్భుత ఔషధం ఇదే?

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో శీతాకాలం సీజన్ ప్రారంభమైందంటే అనేక అలర్జీలు, ఇన్ఫెక్షన్లు , చర్మ సమస్యలు కూడా ప్రారంభమైనట్టే అని చెప్పొచ్చు. ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు తడి వాతావరణంలో చక్కగా పెరిగి మన ఇమ్యూనిటీ సిస్టంపై దాడి చేసి అనేక అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి .

ముఖ్యంగా చిన్నపిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫ్లూ, జ్వరం, దగ్గు ,ఒళ్ళు నొప్పులు తలనొప్పి, గొంతు నొప్పి వంటి అనేక సమస్యలు శీతాకాలంలో ఎక్కువగా తలెత్తుతుంటాయి. మన అందరి ఇల్లల్లో కచ్చితంగా ఉండే పసుపు తో ఇలాంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఆహారంలో రుచికోసం వాడే పసుపు లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కావున మనం తీసుకునే ఆహారంతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని ముఖ్యంగా చిన్నపిల్లలకు తాగిస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు.

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పసుపు కలిపిన పాలను సేవిస్తే శ్వాస వ్యవస్థ ఇన్ఫెక్షన్ తగ్గి నిమోనియా, సైనస్, ఆస్మా వంటి సమస్యలను నియంత్రించవచ్చు. పసుపు కలిపిన పానీయాన్ని తాగడం వల్ల మన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది.

పసుపులోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి క్యాన్సర్, అల్జీమర్ వ్యాధి, హై బీపీ, లివర్ సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లకు పసుపును మెత్తని మిశ్రమంగా మార్చి మర్దన చేసుకుంటే అనేక చర్మ సమస్యలు తొలగి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.