జుట్టు ఎక్కువగా రాలుతోందా.. కారణాలు ఇవే కావచ్చు?

యుక్త వయసులోనే జుట్టు రాలడం, తెల్లబడడం, చిట్లిపోవడం వంటి అనేక జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్, బయోటిన్ వంటి పోషకాలు లోకించడం, వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా అనేక జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. జుట్టు రాలడానికి గల కారణాలు, జుట్టు రాలడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు సమస్యలు తలెత్తడానికి పోషకాహార లోపం కారణ కావచ్చు. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ , విటమిన్స్ లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ ప్రోటీన్స్ లోపాన్ని సవరించడానికి మాంసం, చేపలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, పాలకూర, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరంలో బయోటిన్ లోపిస్తే జుట్టు బలహీనంగా మారడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లోపాన్ని సవరించుకోవడానికి పుట్టగొడుగులు, చేపలు, బీన్స్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

మన శరీరంలో ఐరన్ , బి12 వంటి పోషకాలు లోపిస్తే రక్తప్రసరణ వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగా అందక జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో రక్త శాతాన్ని పెంచడానికి సహాయపడే ఐరన్ మూలకాన్ని స్వీకరించడంలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. కావున విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, బత్తాయి, కివి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది.

మనం తినే ఆహారంలో విటమిన్ ఈ లోపిస్తే జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ లోపాన్ని సవరించుకోవడానికి విటమిన్ ఈ అధికంగా ఉండే పల్లీలు, సముద్రపు చేపలు, గుడ్లు వంటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొబ్బరి నూనెలు రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపి తలకు మర్దన చేసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది.