ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమందిని కంటి సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరగడంతో పాటు పిల్లలు టీవీలకు ఆకర్షితులు కావడంతో ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అయితే కంటి సంబంధిత సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది.
కళ్లలో దురద, మంట లాంటి సమస్యల వల్ల మనలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఉసిరిని తరచూ తీసుకుంటే మంచిది. ఉసిరి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి లభించే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజూ ఉసిరి తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ప్రతిరోజూ కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే కంటిచూపు మెరుగవుతుంది.
ప్రతిరోజూ ఆవకాడో తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిరోజూ క్యారెట్ తీసుకుంటే మంచిది. క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు సులభంగా దూరమవుతాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ వల్ల కళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. సిట్రస్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
సిట్రస్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.