వెన్ను నొప్పి సమస్య వెంటాడుతోందా…నొప్పి నుంచి చిటికెలో బయటపడే మార్గాలు!

మనం నిటారుగా నిలబడడానికి, కూర్చోవడానికి వెన్నెముకే ఆధారం.వెన్నెముకలో సమస్యలు తలెత్తితే  తీవ్రమైన ఒత్తిడి, నొప్పితో ఒకచోట కుదురుగా కూర్చోలేము,నిలబడలేము ఒకప్పుడు 65 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వెన్నునొప్పి సమస్యలు తలెత్తే కానీ ఈ రోజుల్లో క్రమ పద్ధతి లేని జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయస్సులోనే వెన్ను నొప్పి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

 

వెన్నునొప్పి సమస్యకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్థియోఫోరోసిస్, రుమటాయిడ్,కండరాలపై ఒత్తిడి, గర్భాశయంలో వాపు, రుతుక్రమంలో ఆటంకాలు ఎక్కువ రోజులు వెన్నునొప్పి సమస్య మిమ్మల్ని వేధిస్తే కచ్చితంగా వైద్య సలహాలు తీసుకోవాలి.వెన్ను నొప్పి సమస్యతో బాధపడేవారు అధిక బరువులు ఎత్తడం మంచిది కాదు. ఒకవేళ బరువు ఎత్తాల్సి వస్తే బరువు మొత్తం వెన్నెముక మీద పడేలాగా కూర్చొని బరువు ఎత్తడం మంచిది కాదు.ఆఫీసులో గాని ఇంట్లో గాని కూర్చున్నప్పుడు సరైన భంగిమలో వెన్నెముక మీద పూర్తి బరువు ఉంచకుండా నిటారుగా కూర్చోండి.

 

నిద్రించేటప్పుడు కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకుంటే వెన్నునొప్పి బాధ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరిగి మళ్లీ కూర్చొని పని చేసుకోవచ్చు. వీలైతే వెన్నెముకకు పూర్తిగా రిలాక్స్ అయ్యేవిధంగా కాసేపు పడుకోవడం మంచిది.ముఖ్యంగా ఎముక, కండరాల దృఢత్వానికి తోడ్పడే క్యాల్షియం,ఐరన్, మెగ్నీషియం,జింక్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మనం తినే ఆహారంలో లోపిస్తే వెన్నెముకకు ఆధారంగా ఉండే కండరాలు, నరాలు బలహీనపడి బరువు మొత్తం వెన్నెముక మీద పడి వెన్నునొప్పి సమస్య తలెత్తుతుంది. కావున మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి.