మెడ నొప్పి సమస్యతో డాక్టర్ల దగ్గరికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందనీ నిపుణులు చెబుతున్నారు. అధిక శారీరక శ్రమ, బరువులు ఎత్తడం వంటి పనులు చేసినప్పుడు మెడనొప్పి ఒళ్ళు నొప్పులు సమస్య తలెత్తడం సర్వసాధారణం అలాకాకుండా తరచూ మెడ నొప్పి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే తక్షణమే వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.ఎందుకంటే మెడ నొప్పి రావడానికి మెనింజైటిస్,రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా క్యాన్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు.
తరచూ మెడ నొప్పి సమస్య తలెత్తడానికి గల ప్రధాన కారణాలను పరిశీలిస్తే గంటల తరబడి ఒకే చోట కూర్చుని కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ వినియోగించడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే చాలా సందర్భాల్లో కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై తీవ్రమైన మెడ నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అలాగే శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సుతో పాటుగా క్షీణిస్తాయి.వయస్సుకు సంబంధిత అరుగుదల అయితే ఎముక స్పర్స్ కు దారితీస్తుంది. దీనివల్ల మెడ కదలికలపై తీవ్ర ప్రభావం పడి మెడ నొప్పి సమస్యకు దారి తీయవచ్చు.మెడలోని ఎముక స్పర్స్ లేదా హెర్నియేటెడ్ డిస్క్ లు వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలను నొక్కి ఉంచడం వల్ల తీవ్రమైన మెడనొప్పి కలుగుతుంది.
మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో విరామం తీసుకుని అటు ఇటు కాసేపు తిరిగితే మెడ కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు మీ భుజాలు మీ తుంటిపై ప్రత్యక్ష రేఖలో ఉండే విధంగా చూసుకోండి. మీ సామర్ధ్యానికి మించి శ్రమించడం బరువులు ఎత్తడం వంటి పనులు అసలు చేయకూడదు.మెడ నొప్పి ఎంతకీ తగ్గకపోతే. దిండు లేకుండా చదునైన నేలపైనే నిద్రపోయేలా చూసుకోండి.