సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మరింత బలపడాలి అంటే వారిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉండాలి.ఇలాంటి అన్యోన్యత వారి మధ్యన ఉండాలంటే ఇద్దరు కూడా ఎంతో ఇష్టతతో లైంగికంగా కలిసినప్పుడే వారి మధ్య అలాంటి బంధం బలపడుతుంది.అయితే ఎక్కువగా చాలా మంది రాత్రిపూట శృంగారంలో పాల్గొంటారు అయితే ఉదయం శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం చాలామందికి తెలియదు.
మరి ఉదయం శృంగారంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…శృంగారంలో పాల్గొన్న సమయంలో శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది మనల్ని ఎంతో మానసికంగా ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. అందుకే ఉదయం శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఉదయం సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.
ఇక పగలంతా పని ఒత్తిడితో రాత్రి అలసిపోయి శృంగారంలో పాల్గొనడానికి చాలామంది ఆసక్తి చూపరు అలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొన్న ఇలాంటి అనుభూతిని పొందలేరు. అందుకే రాత్రంతా విశ్రాంతి తీసుకుని ఉదయం సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎంతో అనుభూతిని పొందుతారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న అభద్రతాభావం కూడా తొలగిపోతుంది.