శరీర బరువు తక్కువగా ఉన్నవారు రోజువారి ఆహారంలో పెరుగు తింటే మంచిదా..? మంచిగా తింటే మంచిదా.?

ప్రతిరోజు భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తినడం మనందరికీ అలవాటే. కొందరు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. మరికొందరు మజ్జిగ తినడమే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు కానీ అసలు విషయానికొస్తే నిజానికి పాలను తోడబెట్టి పెరుగుగా మారుస్తారు పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది. కనుక పాలల్లో ఉండే పోషక పదార్థాలు అన్నీ పెరుగు ,మజ్జిగలో కూడా ఉంటాయి. కావున పెరుగు మజ్జిగ రెండు మన ఆరోగ్యానికి మంచివే. అయితే మనం పెరుగు తినాలా మజ్జిగ తినాలా అన్న విషయాన్ని మన ఆరోగ్య పరిస్థితుల దృశ్య మనమే నిర్ణయించుకోవాలి.

మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే రోజువారి ఆహారంలో పెరుగును తినకూడదు ఎందుకంటే అత్యధిక ప్రోటీన్స్ ఉన్న పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు రాత్రి సమయాల్లో పెరుగు తింటే గ్యాస్ట్రిక్, అసిడిక్ రిఫ్లక్స్ , ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తి నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. కావున జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు పలుచటి మజ్జిగ తాగడమే మంచిది.ఆయుర్వేదం ప్రకారం పెరుగును రాత్రి పూట తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది అసమతుల్యతలకు కారణం అవుతుంది. ముక్కులో అధికంగా శ్లేష్మం పెరిగేలా చేస్తుంది. దగ్గు జలుబుకు కారణం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అతి బరువు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగలో ఉండే కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమై ఉండి త్వరగా జీర్ణం అవుతాయి కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తదు.అదే పోషకాహార లోపం, తక్కువ శరీర బరువు కలిగిన వారు పెరుగు ను ఆహారంగా తీసుకోవాలి ఎందుకంటే మజ్జిగలో ప్రోటీన్స్, కొవ్వు పదార్థం విచ్ఛిన్నమై ఉండడంవల్ల ఆసక్తి వీరికి సరిపోదు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం. ఇందులోని లాక్టో బాసిల్లై ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు , లాక్టోస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి