రాత్రి సమయంలో పెరుగు తింటే ఇన్ని సమస్యలా.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే!

మనలో చాలామంది పెరుగు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. కొంతమంది మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పెరుగు తినడానికి ఆసక్తి చూపిస్తే మరి కొందరు రాత్రి సమయంలో మాత్రమే పెరుగు తింటారు. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచడంలో పెరుగు తోడ్పడుతుందని చెప్పవచ్చు. వైద్యులు సైతం పెరుగును తప్పనిసరిగా తినాలని చెబుతారు.

 

అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు పెరుగును తీసుకుంటే దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనలో చాలామంది పెరుగును ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. అయితే ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు తినడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

రాత్రి సమయంలో పెరుగు తినడం కంటే పలుచని మజ్జిగ తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడేవాళ్లు పెరుగును తీసుకుంటే ఆ సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సమస్యలు లేని వాళ్లు పెరుగును తీసుకోవచ్చు. హైబీపీని అదుపులోకి తీసుకురావడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

పెరుగులో ఉండే ఫాస్పరస్ ఎముకలను బలపరిచే విషయంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం పెరుగుకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. రోజూ పెరుగు తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే సులువుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.