క్యాన్సర్ ను దూరం చేయడంలో మేలు చేసే పండు ఇదే.. ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్యాన్సర్ అంటే, శరీరంలోని కణాలు అసాధారణంగా పెరగడం అని చెప్పవచ్చు. క్యాన్సర్‌కు కారణం కణాలలోని డీ.ఎన్.ఏలో మార్పులు అని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిర్ధారించడానికి బయాప్సీ చేయడం జరుగుతుంది. క్యాన్సర్‌ను గుర్తించి, సమయానికి చికిత్స చేస్తే ప్రాణాలతో సులువుగా బయటపడే ఛాన్స్ ఉంటుంది.

క్యాన్సర్‌ను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అని పిలుస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌వల్ల శరీరంలో నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్‌వల్ల కణాలు అస్తవ్యస్తంగా పెరిగి కణ సమూహాలను ఏర్పరిచే అవకాశాలుంటాయి. క్యాన్సర్‌వల్ల శరీరంలోని ఇతర భాగాలపై దాడి చేసే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ వల్ల లక్షలాది మంది బిడ్డలు అనాథలుగా మారుతున్నారు.

దక్షిణ అమెరికాలో దొరికే సోర్ సాప్ అనే పండు క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. ఈ పండును లక్ష్మణ ఫలం అని కూడా పిలుస్తారు. సీతాఫలంలా కనిపించే ఈ పండు అన్నోనేసి కుటుంబానికి చెందినది కాగా ఈ పండు రుచికి పుల్లగా ఉంటుంది. అద్భుతమైన గుణాలు ఉన్న లక్ష్మణ ఫలం సహాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

ఈ పండు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కలిగి ఉంటుంది. ఈ పండులో యాంటీ కాన్సికోజెనిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ నివారణ, చికిత్సకు సంబంధించి ఈ పండు తోడ్పడుతుంది. ఇతర పండ్లతో పోల్చి చూస్తే ఈ పండు ఖరీదు కొంతమేర ఎక్కువని చెప్పవచ్చు.