రక్త పోటు,ఉబకాయం,డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను సేవిస్తే…. మంచిదేనా?

bottle-coconut-water-put-dark-background_1150-28239

రోజుకొక కొబ్బరి బొండం మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కొబ్బరి బొండంలో ఎంతో స్వచ్ఛమైన ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు కలిగిన నీరు లభ్యమవుతుంది. ప్రతిరోజు కొబ్బరి నీటిని సేవిస్తే మన శరీర పోషణకు అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, అమినో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం వంటి సహజ సిద్ధమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
సాధారణంగా చాలామంది వేసవికాలంలోనూ లేదా మన ఆరోగ్యం బాగోలేనప్పుడే కొబ్బరి నీరును తాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాకాకుండా కొబ్బరి నీటిని తరచూ తాగడం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య మీ దరి చేరదంటున్నారు నిపుణులు.

సాధారణంగా మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ తో పోలిస్తే కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్స్ ,గ్లూకోజ్ అత్యల్ప పరిమాణంలోనే ఉంటాయి. మరియు ప్రమాదకర రసాయనాలు దాదాపు శూన్యం అనే చెప్పొచ్చు. కావున కొంత ఖరీదైనప్పటికీ తాజా కొబ్బరి నీళ్లను తాగడమే మన ఆరోగ్యానికి మంచిది. కొబ్బరినీరు తరచూ తాగడం వల్ల మన శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతుంది. మరియు కొబ్బరినీళ్ళల్లో శరీర బరువును పెంచే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉంటాయి కాబట్టి అతి బరువు సమస్య ఉన్నవారు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నిక్షేపంగా తాగొచ్చు.

కొబ్బరి నీళ్లల్లో ఉండే అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో నిల్వ ఉండే చెడు కొలెస్ట్రాల్ నీ, ట్రై-గ్లిజరైడ్ స్థాయిలను నియంత్రించే గుణం ఉండడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా అరికట్టి గుండెపోటు,రక్తపోటు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉన్న మెగ్నీషియం, జింకు నాడీ కణాభివృద్ధికి తోడ్పడి మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది

వాంతులు, విరోచనాలు, అతిసారం సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.కొబ్బరి నీళ్లను తరచు తాగడం వల్ల వీటిలో పుష్కలంగా ఉన్న కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచడమే కాకుండా కండరాల కదలికలను మెరుగుపరిచి కీళ్ల నొప్పులు, కండరాల వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించడంలో కూడా కొబ్బరి నీళ్లు ఎంతో ప్రభావం గా పని చేస్తాయి.