వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి మంచిదా…. నిపుణులు ఏమంటున్నారంటే?

వైట్ షుగర్ మనం నిత్యం వంటలలో ఉపయోగించే వాటిలో ఒకటి అయితే ఈ మధ్యకాలంలో వైట్ షుగర్ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు.ఇక ప్రస్తుతం మార్కెట్లో బ్రౌన్ షుగర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రౌన్ షుగర్లో సాధారణ వైట్ షుగర్ తో పోలిస్తే అదనపు ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజు వాడే వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ లో రసాయనాల సమ్మేళనం చాలా తక్కువ. బ్రౌన్ షుగర్ క్యాలరీలు తక్కువగా ఉండి మన శరీరానికి అవసరమైన పొటాషియం,జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్రౌన్ షుగర్ ను నేరుగా చెరుకు నుంచి కాకుండా బెల్లం నుంచి సేకరిస్తారు.కావున ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే అని చెప్పొచ్చు.

మన ప్రతిరోజు వాడే వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. కావున అతి బరువు, దీర్ఘకాయంతో బాధపడేవారు వైట్ షుగర్ కు బదులు బ్రౌన్ షుగర్ ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ లో పొటాషియం, జింకు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర ఎనీమియా వంటి వ్యాధులతో బాధపడే వారికి మంచి ఫలితాలు ఇస్తుంది.

బ్రౌన్ షుగర్ లో వైట్ షుగర్ కంటే అధిక మోతాదులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలని దృఢంగా ఉంచి కీళ్ల నొప్పు, మోకాళ్ళ నొప్పులు, ఎముక పెలుసుగా మారడం వంటి సమస్యలను నివారిస్తుంది.ఆస్తమా రోగులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు బ్రౌన్ షుగర్ లో అల్లం రసాన్ని కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్యులు.
బ్రౌన్ షుగర్ లో అధికంగా ఉన్న విటమిన్ బి6 చర్మం లోని మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.బ్రౌన్ షుగర్ లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే అద్భుత ఔషధ గుణాలు ఉన్నందున మలబద్ధకం, ఉబ్బసం, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేసుకోవచ్చు.