ఎసిడిటీ సమస్య వేధిస్తోందా? ఈ ఆహారపు అలవాట్లే కారణం కావచ్చు?

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఎసిడిటీ ప్రధానమైనది గానే చెప్పొచ్చు. ఈ సమస్యకు ప్రధాన కారణం క్రమ పద్ధతిలేని ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ప్రధానంగా చెప్పొచ్చు మసాలా ఆహారాన్ని ఎక్కువగా తిన్నప్పుడు అరుగుదల సమస్య తలెత్తి అజీర్తి, గొంతులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఎసిడిటీ సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగితే అల్సర్ ,ఉదర క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీయవచ్చు. అందుకే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎసిడిటీ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ, టీ వంటి పానీయాలను సేవిస్తే వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ కొందరిలో యాసిడ్ రిఫ్లెక్షన్ కారణమై ఎసిడిటీ సమస్యకు దారి తీయవచ్చు. దాంతోపాటే తలనొప్పి, వికారం, నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటివారు తప్పనిసరిగా ప్రతిరోజు ఖాళీ కడుపుతో కాఫీ, టీ వంటి పానీయాలను సేవించడం తక్షణమే మానుకోవాలి. అలాగే కొందరిలో చక్కెరను ఎక్కువగా తీసుకున్న కూడా ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది అలాంటివారు చక్కెరకు బదులు బెల్లమును ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, స్పైసి ఫుడ్ తినడానికే ఎక్కువమంది ఇష్టపడుతున్నారని అనేక సర్వేల్లో వెల్లడింది. వీటిల్లో ఉండే సంతృప్త క్లిష్ట కొవ్వులు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుని అజీర్తి, కడుపులో మంట, గొంతులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎక్కువగా పచ్చళ్ళు తినే అలవాటు ఉన్నవారికి కూడా ఎసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. పచ్చలలో ఎక్కువగా ఉప్పు కారం వెనిగర్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు కావున యాసిడ్ రిఫ్లెక్షన్ తలెత్తుతుంది ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్ వంటివి ఎక్కువగా తాగితే వీటిలో ఉండే రసాయనాలు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి అరుగుదల సమస్య తలెత్తుతుంది దాంతో ఎసిడిటీ సమస్య మొదలై దీర్ఘకాలంలో ప్రమాదకర అల్సర్ వ్యాధికి కారణం కావచ్చు.