మన జీవన శైలిలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది టీనేజర్స్ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పక్కనపెట్టి జంక్ ఫుడ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల మనలో పోషకాహార లోపం తలెత్తి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా 19 సంవత్సరాల లోపు అమ్మాయిలు
తీవ్రమైన రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వయసు మళ్ళిన వారిలోనూ, గర్భిణీ మహిళల్లో సాధారణంగా రక్తహీనత సమస్య తలెత్తుతుంది కానీ మన రోజువారి ఆహారపు అలవాట్లు కారణంగా 19 సంవత్సరాల లోపు అమ్మాయిల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుండడంతో ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి కానీ 90 శాతం మంది అమ్మాయిలు 10 శాతం లోపే రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడంతో భవిష్యత్తులో వీరు తీవ్రమైన రక్తహీనత సమస్యతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తీవ్రమైన రక్తహీనత సమస్యను ఎదుర్కోవడానికి మొదట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను పక్కనపెట్టి సంపూర్ణ పోషకాలు ఉన్న పండ్లు ,కూరగాయలు , ఆకుకూరలను ఎక్కువగా రోజువారి ఆహారంలో తీసుకోవాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా ఐరన్ మాత్రమే అందిస్తుంది వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతోపాటు అత్యధిక ప్రోటీన్స్ ఉన్న గుడ్డు, మాంసం ,చేపలను వారంలో రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ సమృద్ధిగా లభించే చిరుధాన్యాలను, చిక్కుడు గోరుచిక్కుడు వంటి కాయగూరలను ఎక్కువగా తినాలి. అప్పుడే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సంతృప్తిగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.