శీతాకాలంలో కడుపునొప్పి సమస్య వేధిస్తోందా..? కారణాలు ఇవే కావచ్చు.. జాగ్రత్త!

సీజన్ మారినప్పుడల్లా వాతావరణ పరిస్థితులు తొందరగా మార్పు చెందుతాయి. ఫలితంగా మన శరీర తత్వం ఆ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో కొన్ని అనారోగ్య సూచికలు కనిపిస్తాయి ముఖ్యంగా శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పరిపోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గి అవయవాల పనితీరు మందగిస్తుంది ఫలితంగా జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి ,దగ్గు,ఒంటి నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, డయేరియా, ఎసిడిటీ, ఉబ్బరం, వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి.

అసలు విషయానికొస్తే శీతాకాలంలో కొంతమందిని తీవ్రమైన కడుపు నొప్పి సమస్య వేధిస్తుంది. దీనికి గల కారణం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి కడుపు నొప్పి సమస్య తలెత్తి తీవ్ర ఒత్తిడిని, బాధను కలగజేస్తుంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో దీనిని కోల్డ్ స్టమక్ పెయిన్ అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు మనలో వేడిని కలిగించే ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ కడుపు నొప్పి దీర్ఘకాలం పాటు మిమ్మల్ని వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి.

తీవ్రమైన కడుపునొప్పి సమస్యకు రోజు వారి ఆహారపువల వాళ్లు కూడా కారణం కావచ్చు. మీరు ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్, త్వరగా జీర్ణం కానీ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి కడుపు నొప్పికి కారణం కావచ్చు. కడుపులో అల్సర్, పుండ్లు, గ్యాస్ట్రోఎస్ఫాజిల్ రిఫ్లక్స్ డిసీజ్ సమస్య ఉన్నవారు కడుపు మంట, ,ఉబ్బసం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తి దీర్ఘ కాలం పాటు తీవ్రమైన కడుపునొప్పి , కడుపు మంట సమస్య వేధిస్తుంది. ఇలాంటివారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు నిర్లక్ష్యం చేస్తే ఉదర సంబంధిత క్యాన్సర్లకు కారణం కావచ్చు.