ఉపవాసం చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?

man-intermittent-fasting-watch-1296x728-header

మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉండటం జరుగుతుంది. రోజంతా ఉపవాసం ఉండేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉపవాసం చేసే ఆడవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఉపవాసం హార్మోన్ల అసమతుల్యతకు సైతం కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఉపవాసం చేయడం వల్ల కొవ్వు కరగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ కు చెందిన కణాలతో పాటు కాలేయానికి సంబంధించిన కణాలపై ఉపవాసం సానుకూల ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. మధుమేహ సమస్యను కూడా ఉపవాసం ద్వారా సులువుగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఉపవాసం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి.

సరైన సమయానికి ఆహారం తీసుకోని మహిళలను హార్మోన్ల అసమతుల్యత సమస్య వేధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే సరైన సమయానికి ఆహారం తీసుకోరో వాళ్లలో జీవక్రియ మందగించే అవకాశాలు అయితే ఉంటాయి. డైటింగ్ పేరుతో సరైన సమాయనికి ఆహారం తీసుకోకపోయినా ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. డైటింగ్ వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.

ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారో వాళ్లలో షుగర్ లెవెల్స్ తగ్గి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. తిండి మానేయడం వల్ల షుగర్ లెవెల్స్ లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.