పిల్లలు ఎందుకు ఏడుస్తారు.. పిల్లలు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

చిన్న పిల్లలు ఏడవడం వల్ల తల్లీదండ్రులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నవజాత శిశువులు అటూఇటూ కదులుతూ ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కువ సమయం ఏడిస్తే మాత్రం తల్లీదండ్రులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో పిల్లలు ఏడ్చిన వెంటనే పాలు తాగడం సరికాదు. లేచీలేవగానే పిల్లలకు పాలు పట్టిస్తే పిల్లలు అదే అలవాటుగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది.

బెడ్ రూమ్ లో కొంత వెలుతురు ఉంటే పిల్లలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. త్వరగా నిద్రలేచే అలవాటు ఉన్నవాళ్లు పిల్లలను త్వరగా నిద్ర పుచ్చటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏడుపులో రకరకాలు ఉండగా ఊయలలో వేసి ఊపడం ద్వారా పిల్లల ఏడుపు ఆపవచ్చు. పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం ద్వారా కూడా పిల్లల ఏడుపును దూరం చేయవచ్చు.

పిల్లలకు జ్వరం వస్తే ఆ సమయంలో శారీరక నొప్పుల వల్ల పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఏడుస్తుంటారు. పిల్లలు ఏడుస్తున్న సమయంలో తల్లీదండ్రులు కొడితే పిల్లలు మరింత ఎక్కువగా ఏడ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలకు తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా పిల్లల ఏడుపు మానిపించే అవకాశాలు ఉంటాయి.

కొన్నిసార్లు పిల్లలు నిద్రలో కదిలితే మెలుకువ వచ్చిందని వాళ్లను ఎత్తుకోవడం మంచిది కాదు. పిల్లలను అలాగే ఉంచి నిద్రపోనిస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. పసిపిల్లలకు తగినంత నిద్ర ఉండేలా తల్లీదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు. పిల్లల ఏడుపు వల్ల తరచూ ఇబ్బందులు పడే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.