ఈ మధ్యకాలంలో చాలామంది అందంగా, యవ్వనంగా కనపడాలి అంటూ మార్కెట్లలో దొరికే లోషన్లు, క్రీమ్లకు అలవాటు పడుతుంటారు. ఇక ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలంటే మేకప్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ఇలా చాలామంది నానా అవస్థలు పడుతుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ గా అందంగా కనపడాలి అని అనుకుంటారు.
ఈ భూమి మీద మూడు వంతులు నీరు, ఒక వంతు భూమి ఉన్నట్టే, మన శరీరంలో కూడా 70 శాతం నీరు, 30% శరీర అవయవాలు ఉంటాయి. అంటే శరీరానికి ముఖ్యమైనది నీరు అని తెలుస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక లీటర్ నీరు తాగాలి. అప్పుడు ఆ నీరు డైరెక్ట్ గా రక్తంలో కలిసి కిడ్నీకు చేరి ఫిల్టర్ అయ్యి మలవిసర్జన ద్వారా బయటకు వెళ్తుంది.
అంటే లోపల పేగులు అంతా శుభ్రం అవుతాయి. మనం రోజు మూడుసార్లు ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారం తీసుకునేటప్పుడు మంచినీళ్లు తక్కువగా తాగాలి. ఆహారం తిన్న అరగంట తర్వాత అర లీటరు లేదా లీటర్ నీళ్లు తాగితే మంచిది. మరి మనం బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యం లేదా ఎండ మన చర్మం పై పడినప్పుడు నీటి శాతం ఎక్కువగా ఉంటే చర్మకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. నీటి శాతం తగ్గితే వడదెబ్బ తగలడం, చర్మం కాంతిని కోల్పోయి గ్లోనెస్ లేకుండా నల్లగా మారుతుంది.
కాబట్టి రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు శరీరానికి అందించాలి. ఇక ఉదయం పూట క్యారెట్ లేదా టమాటా జ్యూస్ తాగితే చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ఇక రోజు రాత్రి పడుకునే ముందు బత్తాయి లేదా కమల పండు జ్యూస్ ను తాగడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగ్గా ఉంటుంది. ఇందులో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
శుభ్రంగా ఈ చిట్కాను పాటించినట్లయితే రెండు మూడు నెలల లోపే చర్మంపై జిడ్డు పోయి, చర్మం మెరుగుపరడం గమనించవచ్చు. బయట లభించే పదార్థాలు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఫలితాలను ఇస్తాయి. సహజ చిట్కాలు కాలక్రమేనా మంచి ఫలితాలను అందించి ఆరోగ్యాన్ని మన సొంతం చేస్తాయి.