మన రోజువారి ఆహారంలో అత్యధికంగా ఉపయోగించే వైట్ షుగర్ వల్ల మన శరీరంలోకి అధిక క్యాలరీలు చేరి శరీర బరువు పెరుగుతుంది.తద్వారా ఉబకాయ, గుండె జబ్బులు డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చాలామంది వైద్యులు చెబుతుంటారు.ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన బ్రౌన్ షుగర్ ను రోజువారి ఆహారంలో ఉపయోగిస్తే సరిపోతుంది. అసలు బ్రౌన్ షుగర్ ను ఎలా తయారు చేస్తారు? వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
మనం ప్రతిరోజు వాడే వైట్ షుగర్ ను నేరుగా చెరుకు రసం నుంచి తయారుచేస్తారు.షుగర్ తెలుపు రంగు రావడానికి ఇందులో చాలా రకాల రసాయనాలు మిక్స్ చేస్తారు. అదే బ్రౌన్ షుగర్ ను నేరుగా చెరుకు నుంచి కాకుండా బెల్లం నుంచి సేకరిస్తారు కావున ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు.సాధారణ వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ లో క్యాలరీలు తక్కువగా ఉండి మన శరీరానికి అవసరమైన పొటాషియం,జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
వైట్ షుగర్ లో అధికంగా రసాయనాలు వాడడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి భవిష్యత్తులో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ లో పొటాషియం, జింకు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.బ్రౌన్ షుగర్ లో అధిక మోతాదులో క్యాల్షియం, ఫాస్పరస్ ఉండి ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది తద్వారా కీళ్ల నొప్పు, మోకాళ్ళ నొప్పులు,ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వైట్ షుగర్ కు బదులు బ్రౌన్ షుగర్ ను ఆహారంగా తీసుకుంటే తక్కువ క్యాలరీలు,ఎక్కువ ఫైబర్ లభ్యమవుతాయి తద్వారా రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రించబడి డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. మరియు శరీర బరువు తగ్గి ఉబకాయ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బ్రౌన్ షుగర్ లో అత్యధికంగా ఐరన్ లభించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.