డైటింగ్, వ్యాయామం లేకుండా సులువుగా బరువు తగ్గాలా.. చేయాల్సిన పనులు ఇవే!

Winter-Weight-Loss-Tips-If-you-want-to-lose-weight-in-winter-include-these-dried-fruits-in-your-diet

మనలో చాలామంది అధిక బరువు వల్ల ఇబ్బంది పడటంతో పాటు వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉన్నా ఈ విధంగా బరువు తగ్గడానికి కొంతమంది ఆసక్తి చూపరు. అయితే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే బరువు తగ్గాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వెల్లుల్లి, ఉల్లిపాయలు, నూనె, మసాలాలు లేని ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలకులు, ఫెన్నెల్, కొత్తిమీర, పసుపు, దాల్చిన చెక్క, అల్లంతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆలివ్ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే.

బెల్లం, తేనె తీసుకోవడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. పెరుగు, వెన్న, నెయ్యి , పాలు, మజ్జిగ కూడా బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. పచ్చి లేదా తేలికగా కాల్చిన కాయలు, విత్తనాలు తీసుకోవడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దానిమ్మ, ద్రాక్షతో పాటు అరటి, ఆపిల్, నారింజ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పాలకూర, పొట్లకాయ, సొరకాయ లాంటి కాయగూరలు తీసుకోవడం సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. మూంగ్, మసూర్, చనా ఇలాంటి పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బియ్యం, గోధుమలు, బార్లీ ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్పవచ్చు.