ఖర్జూర పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్,ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్,యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఖర్జూర పండులో అత్యధికంగా ఉండే చక్కర పదార్థం శరీర బరువును పెంచడంతోపాటు డయాబెటిస్ వ్యాధికి కారణమవుతాదని చాలామంది అపోహ పడుతుంటారు. నిపుణుల సూచనల ప్రకారం ప్రతిరోజు నాలుగు ఖర్జూర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక శరీర బరువు ,షుగర్ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలను తినడానికి సంకోచిస్తుంటారు. అలాంటివారు నిక్షేపంగా ఖర్జూర పండ్లను తినొచ్చని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు నాలుగు ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అతిగా ఆకలి వేయడాన్ని తగ్గిస్తుంది. మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి ఉబకాయం రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.ఖర్జూర పండ్లలో అత్యధికంగా ఐరన్, పొటాషియం లభిస్తుంది. ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కావున చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లుల ఆహారంలో తప్పనిసరిగా ఖర్జూర పండును తీసుకోవాలి.
అందరూ అనుకున్నట్లుగా ఖర్జూర పండ్లను అధికంగా తింటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగవు. వీటిల్లో అత్యధికంగా ఉండే పీచు పదార్థం రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండి సంతానలేమితో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి గంట ముందు గోరువెచ్చని పాలతో కలిపి ఖర్జూర పండ్లను తింటే వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరిగి సంతానలేమి సమస్య తొలగిపోవడమే కాకుండా లైంగిక సామర్థ్యం కూడా పెంపొందుతుంది.