తీగజాతి కాయగూరల్లో ఒకటైన సొరకాయను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.సొరకాయతో రుచికరమైన కర్రీ, వేపుడు, సలాడ్స్, ఆల్వా వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని తినొచ్చు. మరియు ఈ రోజుల్లో చాలామంది రోజువారి డైట్ లో సొరకాయ జ్యూస్ ని కూడా ఎక్కువగానే వినియోగిస్తున్నారు. ప్రతిరోజు సొరకాయ జ్యూస్ సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా సొరకాయ లో కొలెస్ట్రాల్ పరిమాణం తక్కువగా ఉండి నీరు, పీచు పదార్థం, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. కావున శరీర బరువును నియంత్రించుకోవాలనుకున్నవారు రోజువారి డైట్ లో సొరకాయను వినియోగిస్తే సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవచ్చు. మరియు సొరకాయలో సమృద్ధిగా లభించే నీరు ఖనిజ లవణాలు శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.తరచూ సొరకాయను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే డెంటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరియు రక్తంలో గ్లూకోస్ శాతాన్ని క్రమబద్ధీకరించి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధించే చర్మంపై ముడతలు,తెల్ల జుట్టు, వెంట్రుకలు పలచబడడం వంటి సమస్యల నుంచి రక్షణ పొందాలంటే ప్రతిరోజు ఉదయాన్నే కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా ఉన్న సొరకాయ జ్యూస్ సేవిస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు. సొరకాయలు సమృద్ధిగా లభించే పొటాషియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు, గుండెపోటు సమస్యలను కొడుతుంది. అలాగే మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.