మసాలా దినుసుల్లో ఒకటైన మెంతులను ఆహారంలో రుచి, సువాసన కోసమే ఎక్కువగా వాడుతుంటారు. అయితే మెంతులను మొలక కట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని తాజా అధ్యయనాల్లో పేర్కొనడం జరిగింది. మొలకెత్తిన మెంతుల్లో ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్సు, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి కాల్షియం, ఐరన్ వంటి సహజ మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున ప్రతిరోజు మొలకెత్తిన మెంతి గింజలను ఆహారంగా తీసుకుంటే మనలో ఇమ్యూనిటీ శక్తి అధికంగా ఉండి అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
మొలకెత్తిన మెంతి గింజలను ప్రతిరోజు తగిన పరిమాణంలో ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న విటమిన్ సి, ఫైబర్ ,ఎమైనో యాసిడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. తరచూ కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు మొలకెత్తిన మెంతులను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే కాల్షియం,
యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాల ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులను నియంత్రించి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు మోకాళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
మొలకెత్తిన మెంతి గింజల్లో పొటాషియం,గెలాక్టోమెనన్ రక్త ప్రసరణ వ్యవస్థను క్రమబద్ధీకరించి హై బీపీ సమస్యను తొలగించి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కిడ్నీ సమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు మొలక కట్టిన మెంతులను ఆహారంగా తీసుకుంటూ వీటిలో సమృద్ధిగా లభించే పాలీఫెనాలిక్ ఫ్లేవనాయిడ్స్ కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన మెంతుల్లో సమృద్ధిగా లభించే మిటమిన్ ఏ విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ మైక్రోబియన్ గుణాలు చర్మం లోని మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మం పై వచ్చే మడతలు మొటిమలను సహజ పద్ధతిలో తొలగించుకోవచ్చు.