ఒక్క దెబ్బతో వేడి మొత్తం బయటకు పోవాలంటే.. ఈ చిట్కా పాటించాల్సిందే!

మనం శరీరం వేడి చేసిందని వైద్యుల చుట్టూ తిరిగి రకరకాల మందులు వాడాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో లభించే ఆహార పదార్థాల వల్ల శరీర వేడిని సులువుగా తగ్గించుకోవచ్చు.

శరీర వేడిని తగ్గించడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మజ్జిగను తాగినట్లయితే మంచి ఫలితం ఉండి వేడి అనేది మన దరిచెరదు. ఇంకా నిమ్మకాయను తీసుకొని చక్కగా నిమ్మరసాన్ని ఉప్పు లేదా చక్కర వేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే దీని ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.

శరీర వేడిని తగ్గించుకోవడానికి మెంతులను పౌడర్ చేసుకుని గోరువెచ్చని నీటిలో ఒకటిన్నర స్పూన్ వేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే మంచి ఫలితం పొందవచ్చు. రాగులు బాగా మెత్తగా పొడి చేసుకుని ఉదయం సాయంత్రం పాలు లేదా గోరువెచ్చటి నీటితో కలుపుకొని తీసుకుంటే దీని ద్వారా వేడి అనేది సమస్య దూరం అవుతుంది.

మనలో చాలామంది వేడి తగ్గడం కోసం రాగిజావను తీసుకోవడం తెలిసిన విషయమే. తర్వాత జీరా, అల్లం లను మిక్సీ వేసుకుని ఆ పౌడర్ ను ఉదయం సాయంత్రం పాలు లేదా గోరువెచ్చని నీటిలో అర స్పూన్ వేసి తాగితే మంచి ఫలితం పొందవచ్చు. రోజు ఒక కొబ్బరి బొండం నీళ్లు తాగినట్టయితే సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఇక వేసవికాలంలో దొరికే పుచ్చకాయ, బత్తాయి లు కూడా ఈ వేడి సమస్యను దూరం చేస్తాయి.

ఇంకా దానిమ్మ పండును రసం లాగా లేదంటే విత్తనాలను తీసుకున్న మంచిది. రోజుకు ఒక దానిమ్మ పండు విత్తనాలు తిన్నట్లయితే శరీరంలో వేడి దూరం అవుతుంది. ఇంకా పల్లెటూర్లలో అయితే తంగడి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఈ చెట్టు పువ్వులు, ఆకులు, మొగ్గలు, చెక్కలు వీరిని దూరం చేయడానికి బాగా దోహద పడతాయి.

చక్కగా వీటిని ఎండగట్టి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటిలో అర స్పూన్ వేసుకొని త్రాగినట్లయితే తొందరగా ఫలితం పొందవచ్చు. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడవు.