నెలసరి సమయంలో నొప్పులకు చెక్ పెట్టాలంటే నెయ్యితో ఇలా చేస్తే చాలు!

సాధారణంగా ప్రతి నెల మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతినెల కడుపునొప్పి, నడుం నొప్పి కాళ్లు చేతులు లాగడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు.అయితే ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు నెయ్యితో ఈ చిన్న చిట్కాను పాటిస్తే నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

నెలసరి సమయంలో ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని పాలల్లోకి కాస్త నెయ్యి కలుపుకుని తాగటం వల్ల ఆ సమయంలో మీరు భరించే నొప్పుల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.పాలల్లో నెయ్యి కలిపి తాగటం వల్ల ఈ సమస్యలు తొలగిపోవడమే కాకుండా మన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడి అసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇక మలబద్ధక సమస్యతో బాధపడే వారికి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది.

ఇలా పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల శరీరంలో ఎముకలకి పటుత్వం కూడా పెరుగుతుంది. ప్రతిరోజు మనకు కలిగే ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడి మెదడు పనికిరాను మెరుగుపరుస్తూ మెదడును అధిక ఒత్తిడి నుంచి ప్రశాంతంగా ఉంటుంది.అదేవిధంగా మన శరీరంలో నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు గోరువెచ్చని పాలలో కాస్త నెయ్యి కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.