పచ్చి మామిడిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరేమో!

పచ్చిమామిడి రుచిని చూడడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం పచ్చి మామిడికాయల సీజన్ రానే వచ్చేసింది.మార్కెట్లో కూడా పచ్చి మామిడికాయలు సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. అద్భుతమైన పుల్లని, వగరు రుచులతో ఉన్న పచ్చి మామిడి తో చేసే చట్నీ, పప్పు, కర్రీస్, ముఖ్యంగా పచ్చళ్ళు రుచిని వర్ణించడం అసాధ్యమని చెప్పొచ్చు.పచ్చి మామిడి అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఔషధ, పోషక విలువలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

పచ్చి మామిడికాయల్లో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా లభ్యమవుతాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పచ్చి మామిడిలో ఉండే విటమిన్ ఏ, కేరోటినాయిడ్స్ కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఈ సీజన్ లో పచ్చి మామిడి కాయలను తింటే విటమిన్స్ లోపం తొలగిపోయి స్కర్వి, చర్మం పొడి వారడం, జుట్టు సమస్యలు, చిగుళ్లలో రక్తం కారడం వంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.

పచ్చి మామిడిలో సమృద్ధిగా ఫైబర్ లభిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అలాగని మరీ ఎక్కువ పచ్చి మామిడికాయలను తింటే జీర్ణ సమస్యలు తలెత్తి అజీర్తి,కడుపులో మంట,గొంతులో మంట, విరోచనాలు సమస్య తలెత్తవచ్చు. పశ్చిమామిడిలో పొటాషియం ,మెగ్నీషియం, జింక్ ఎక్కువగా లభిస్తుంది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.