నీలగిరి ఆకుల హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చట!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో నీలగిరి ఆకుల గురించి వినే ఉంటారు. ఈ ఆకుల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. తలనొప్పిని తగ్గించే జండూబామ్ లలో నీలగిరి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. నీలగిరి ఆకులతో తయారు చేసే యూకలిప్టస్ ఆయిల్ వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ చెట్టు ఆకులలో, ఆయిల్ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ ఆకుల వాసనను పీల్చడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. యూకలిప్టస్ ఆకులను నీళ్లలో వేసి ఆవిరి పట్టుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాలిన పుండ్లు గాయాలను తగ్గించడంలో ఈ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులతో తయారు చేసిన ఆయిల్ ను రాసుకుంటే చుండ్రు, పేలు సమస్యలను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆకులతో చేసిన ఆవిరి పీల్చడం వల్ల తలనొప్పి, గొంతు నొప్పితో పాటు దగ్గు సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తమా రోగులు ఈ ఆకులను ఉపయోగించడం వల్ల ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. నీలగిరి ఆకులను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నీలగిరి తైలంను వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటుంది.

సాంప్రదాయ వైద్యంలో వీటి ఆకులను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నీలగిరి ఆకులను మౌత్ వాష్ ల తయారీలో సైతం వినియోగిస్తారు. పొడి చర్మాన్ని మెరుగుపరిచే విషయంలో ఈ ఆకులు ఉపయోగపడతాయి. ఈ ఆకులు వాడటం వల్ల శరీరానికి లాభమే తప్ప నష్టం ఉండదు.