మునగాకు పొడిని ఉదయం సాయంత్రం మూడు నెలల పాటు ప్రతిరోజూ 7 గ్రాముల చొప్పున కషాయం రూపంలో తీసుకున్నట్లయితే దాదాపు 300 రకాల వ్యాధులను అదుపులో ఉంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పల్లెల్లో సాధారణంగా కనిపించే మునగ మొక్కలోని ఆకులు,పువ్వులు, వేర్లు, బెరడులో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మునగాకులో యాంటీ ఇన్ప్లిమెంటరి గుణాలు, యాంటీ ఫంగల్ ,యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు సమృద్ధిగా ఉండి మన శరీరంలో ఉన్న వ్యాధికారకాలతో సమృద్ధిగా పోరాడి మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
తాజా మునగాకు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండడం కొంత కష్టమే అందుకే మునగపొడిని తయారు చేసుకుని గాజు జార్లో నిలువ చేసుకుంటే ఏడాది పొడవునా మునగ పొడిని ఉపయోగించి సకల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.తాజా మునగాకుల్లో ఉండే పోషకాలే మునగ పొడిలో కూడా లభ్యమవుతాయని వైద్యులు చెబుతున్నారు.100 గ్రాము మునగ పొడిలో అత్యధికంగా కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజ పోషకాలు మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి కావున ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్, సయాటికా, నరాల బలహీనత, రక్తపోటు వంటి సాధారణంగా వచ్చే వ్యాధుల నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు
మునగాకులో ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు,
విటమిన్ సి, బీటా కెరోటిన్, డెంటరీ ఫైబర్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి టైప్ 2 డయాబెటిస్, పెద్ద ప్రేగు క్యాన్సర్, శ్వాస కోశ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సమంతవంతంగా పోరాడుతుంది.100 గ్రాముల మునగ ఆకుల పొడిలో 28 మిల్లీగ్రాముల ఐరన్ ఉండి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంతో మనలో రక్తహీనత సమస్య దూరమవుతుంది.గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ప్రతిరోజు మునగ పొడి కషాయాన్ని సేవిస్తే అనీమియా, మూత్రాశయ ఇన్ఫెక్షన్, అజీర్తి ,కడుపులో మంట కాళ్లవాపులు వంటి సమస్యలు తొలగిపోతాయి. మునగపొడి కొందరిలో అలర్జీ సమస్యలకు కారణం కావచ్చు అలాంటివారు తక్షణం వైద్య సలహాలను తీసుకోవడం మంచిది.