గ్రీన్ యాపిల్ పండ్లలోని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు.

ప్రతిరోజు ఒక గ్రీన్ ఆపిల్ పండును ఆహారంగా తీసుకుంటే డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లలో మన శరీర జీవక్రియలకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్ , కార్బోహైడ్రేట్స్ , యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. కావున ప్రతిరోజు ఒక ఆపిల్ పండును మన రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మనలో ఇమ్యూనిటీ సిస్టం దృఢంగా తయారై సీజనల్గా మన ఆరోగ్యం పై దాడి చేసే వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్
మరియు అలర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ ఆపిల్ పండులో సామృద్దిగా విటమిన్ సి ఏ యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి. విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ఐరన్ ను గ్రహించడంలో సహాయపడి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అన్ని అవయవాలకు సక్రమంగా ఆక్సిజన్, రక్తం సరఫరా అయ్యి అవయవాల పనితీరు మెరుగుపడి నీరసం, అలసట, ఒత్తిడి, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు తొలుగుతాయి. గ్రీన్ ఆపిల్లో పుష్కలంగా ఉన్న యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు శ్వాస వ్యవస్థను దృఢపరిచి ఉబ్బసం, ఆస్మా వంటి సమస్యలను అదుపు చేయడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

గ్రీన్ యాపిల్ లో పుష్కలంగా ఉన్న కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. తరచూ గ్రీన్ యాపిల్ ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ఫ్యాటీ ఆమ్లాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఆపిల్ పండులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఏ రెటీనా పనితీరును మెరుగుపరిచి కంటిచూపును పెంచుతుంది. చర్మ సమస్యలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అల్జీమర్ వ్యాధితో బాధపడేవారు తరచూ గ్రీన్ యాపిల్ తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.