పచ్చి బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కనుక తెలిస్తే అసలు వదిలిపెట్టరు!

papaya-tree-leaf-1296x728-header

మన ఇంటి ఆవరణంలో పెరిగే బొప్పాయి పండులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రతిరోజు బొప్పాయి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టవచ్చు. బొప్పాయి లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం,జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి కనుక బొప్పాయి తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఇక చాలామంది పండిన బొప్పాయి పండు తినడానికి ఇష్టపడతారు కానీ పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే పచ్చి బొప్పాయిని డైరెక్ట్ గా కాకుండా చాలా మంది కూర తయారు చేసుకుని తింటూ ఉంటారు అయితే పచ్చి బొప్పాయిని తినడం వల్ల మన శరీరానికి ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని వస్తే…

పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైటో న్యూట్రిఎంట్స్ కొత్త కణాలను పెరిగేలా చేస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ గ్యాస్ట్రిక్ట్ సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన ఎంజైములు శరీరంలోని పేగు కదలికలకు దోహదపడటమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికీ పచ్చి బొప్పాయి జ్యూస్ కానీ లేదంటే బొప్పాయి ఆకుల జ్యూస్ కానీ ఇస్తే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.