యాలకులు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. తెలిస్తే తినకుండా ఉండలేరు?

మన భారతదేశంలో మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల ఎన్నో వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన వంటింట్లో లభించే యాలకులు వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాలకులు చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వీటిని తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు. యాలకులలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. యాలకులను ఉపయోగించి వంటలు తయారు చేయడం వల్ల వంటలు రుచిగా ఉండటమే కాకుండా అద్భుతమైన సువాసన కలిగి ఉంటాయి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు యాలకులు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాలకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా యాలకులు మంచి సువాసనని అందిస్తాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ యాలకులను తినడం వల్ల వారి సమస్య దూరం అవటమే కాకుండా నోటికి సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు యాలకులను తినటం వల్ల అవి శరీరం నుంచి విషయాన్ని బయటకి పంపించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రతిరోజు యాలకులు తినటం వల్ల చర్మం మృదువుగా మారి ముఖం మీద మంచి నిగారింపు సంతరించుకుంటుంది.

మొటిమలు మచ్చలతో బాధపడేవారు ప్రతిరోజు యాలకులు తినటం లేదా యాలకులతో తయారుచేసిన నూనె మొహానికి అంటించడం వల్ల మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల మొహనికి మంచి నిగారింపు వస్తుంది. అంతే కాకుండ యాలకుల పొడిలో కొంచం రోజ్ వాటర్ కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకోవటం వల్ల కూడా మొహంలో నిగరింపు ఉంటుంది. పెదవుల ఆరోగ్యానికి కూడా యాలకులు బాగ ఉపయోగపడతాయి. యాలకులను పొడి చేసి ఆ పొడి లో తేనే కలిపి పెదవులకు అంటించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల పెదవులు అందంగా, మృదువుగా తయారవుతాయి.