ఇటీవలే కాలంలో గాడిదలు అంతరించిపోయే దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు గాడిదల సంఖ్య పెంపుకు కృషి చేస్తూ జనాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లక్షలు జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలి గాడిదల పెంపకం చేపట్టారు అన్న కథనాలను పత్రికల్లో, టీవీలో చాలానే చూసి ఉంటాం కదా వీటన్నిటికీ ఒకటే కారణం గాడిద పాలకు ఉన్న గిరాకీ. ఏంటి ఆశ్చర్య పోతున్నారా! గాడిద పాలు ఆవు పాలకు ప్రత్యామ్నాయమని,తల్లిపాలతో సమానమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్వపు రోజుల్లో పల్లెల్లో చిన్నపిల్లలకు గాడిద పాలను తాగించడం మనందరికీ తెలిసే ఉంటుంది. దానికి కారణం గాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఔషధ గుణాలు ఉండడమే ఈ విషయాన్ని మన పూర్వీకులు ఆనాడే గుర్తించారు. ఆధునిక పోకడలకు పోయి మనం ఈ విషయాన్ని మర్చిపోయాం అంతే. ఆవు పాలతో పోల్చినప్పుడు గాడిద పాలల్లో తక్కువ కొవ్వు, ఎక్కువ ఖనిజలవనాలు, లాప్టోస్, ప్రోటీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. అందుకే గాడిద పాలకు అంత గిరాకీ.
గాడిద పాలులో విటమిన్స్, మినిరల్స్ సమృద్ధిగా లభించడంతోపాటు పాలీఅన్ శాచ్యురేటెడ్, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి కావున గుండె, ఎముకలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి చర్మంపై వచ్చే అలర్జీలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంతోపాటు వృద్ధాప్య ఛాయాలను తగ్గించడంలో సహాయపడతాయి. తరచూ గాడిద పాలను తాగితే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి తద్వారా ప్రమాదకర డయాబెటిస్ వ్యాధికి సులువుగా చెక్ పెట్టవచ్చు. గాడిద పాలలో ఉండే అద్భుత ఔషధాలైన లైసోజైమ్, లాక్టో ఫెర్రీన్, శక్తివంతమైన ఆక్సిడెంట్లు ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి