ఈ లక్షణాలు మీలో ఉంటే కాల్షియం లోపం తలెత్తినట్లే… కాల్షియం లోపిస్తే ఈ అనర్థాలు తప్పవు!

యుక్త వయస్సులోనే పౌష్టికాహార లోపంతో బాధపడితే అనేక తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సంతులిత ఆహార లోపం వల్ల ఎక్కువమందిలో కాల్షియం లోపం తలెత్తుతోంది ఫలితంగా ఎముకల్లో దృఢత్వం తగ్గి ఎముకలు గుల్లగా మారడం, విరిగిపోవడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో పాటు ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్, రుమటాయిడ్, చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో నిత్యం బాధపడాల్సి వస్తోంది.

నిత్య జీవక్రియలను క్రమబద్ధీకరించడంలో క్యాల్షియం పాత్ర కీలకమైనదిగా చెప్పొచ్చు. కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంతోపాటు నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడుకు సరైన సమయంలో సంకేతాలను పంపడంలో సహాయపడుతుంది. మరియు హార్మోన్ల పనితీరు, కండరాలు, నరాల వ్యాకోచం సంకోచం,గుండె పనితీరును మెరుగుపరచడంలో మరియు గోర్లు వెంట్రుకల ఆరోగ్యాన్ని రచించడంలో క్యాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

మన శరీరంలో కాల్షియం లోపం తలెత్తితే హైపోకాల్సిమియా అనే వ్యాధి తలెత్తుతుంది.
కాల్షియం లోపం తలెత్తితే ముందస్తు సూచికగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయానికి ఆకలి దప్పిగా లేకపోవడం, దంతాల పట్టుత్వం తగ్గి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం, చిగుళ్ల వాపు రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడం, గోర్లు అందవిహీనంగా మారి చీలినట్లు కనిపించడం, వెంట్రుకలు సహజ దృఢత్వాన్ని కోల్పోయి రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాల్షియం లోపం వల్ల ఎముకల్లో దృఢత్వం తగ్గి పేలుసుగా మారి క్రమంగా క్షీణిస్తాయి దీన్నే ఆస్తియోపేనియా అని కూడా అంటారు. చిన్నపిల్లల్లో క్యాల్షియం లోపం తలిపితే ఎముకల్లో సాంద్రత కోల్పోయి రికెట్స్ వ్యాధి బారిన పడతారు. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా పాలు, గుడ్లు, చేపలు, చిరుధాన్యాలు ఉండునట్లు చూసుకోవాలి. చిన్నపిల్లలకు తప్పనిసరిగా రోజుకు రెండు గ్లాసుల పాలు, ఉడకబెట్టిన గుడ్డు, నెయ్యిని తప్పనిసరిగా తినిపించాలి. అలాగే కాల్షియం సమృద్ధిగా లభించి గోంగూర, బచ్చలి కూర, పాలకూర, బ్రోకలీ, బీన్స్ వంటివి ఎక్కువగా తింటే మనలో క్యాల్షియం లోపాన్ని సరి చేసుకోవచ్చు.