దీర్ఘకాలం పాటు మీలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ వ్యాధులతో బాధపడాల్సిందే… ఇకనైనా జాగ్రత్త పడండి!

Houston-ER-Kidney-Stones

మన పూర్వీకుల్లో చాలామందిలో 60 సంవత్సరాల తర్వాత మాత్రమే కిడ్నీ సమస్యలు తలెత్తేవి కానీ ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నది. కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే క్రమ పద్ధతి లేని ఆహార పలవాట్లు, శారీరక శ్రమ లోగించడం, శరీర జీవక్రియలకు అవసరమైన నీటి నీటి శాతం లభించకపోవడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.కారణాలు ఏవైనా కిడ్నీ ఇన్ఫెక్షన్లను మొదట్లో గుర్తించగలిగితే డయాలసిస్, కిడ్నీ మార్పిడి స్టేజ్ కు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

రోజువారి జీవక్రియల్లో కొన్ని మార్పులను మొదట్లోనే గుర్తించగలిగితే కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా ఎక్కువ మందిలో కిడ్నీ సమస్యలు తలెత్తడానికి మూత్రశయ ఇన్ఫెక్షన్లే కారణమని నిపుణులు చెబుతున్నారు మరియు
మూత్రం ద్వారా మాత్రమే కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ని సులభంగా గుర్తించవచ్చ.

కిడ్నీ పనితీరులో లోపాలు తలెత్తుతున్నాయి అన్నదానికి సూచికంగా కొన్ని లక్షణాలను మొదట్లోనే గుర్తించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, భరించలేని కడుపునొప్పి ఉండడం, మూత్రం వెళ్ళినప్పుడు దుర్వాసన రావడం, మూత్రంలో రక్తం పడడం, దప్పిక ఆకలి వేయకపోవడం, ఉదయం లేవగానే వాంతులు వికారం వంటి లక్షణాలు ఎక్కువ రోజులు మిమ్మల్ని బాధిస్తే తప్పనిసరిగా మీ దగ్గరలోని వైద్యుల్ని సంప్రదించాలి. అలా కాకుండా ఈ లక్షణాలను సాధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే అధిక ఇన్ఫెక్షన్ కారణంగా కిడ్నీ పనితీరు దెబ్బతిని డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటివి చేయించుకోవాల్సి వస్తుంది.