మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే మందులు వాడాల్సిన అవసరం లేనట్టే!

ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మూత్రపిండాలలో లేదా మూత్ర నాళంలో ఈ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. శరీరంలో ఎక్కువ వ్యర్థాలు ఉండి, దాన్ని బయటకు పంపడానికి చాలా తక్కువ ద్రవం ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మూత్రంలోని కాల్షియం, ఫాస్ఫేట్‌తో కలిసి రాళ్లు ఏర్పడటం జరుగుతుంది.

అసమతుల్యత ఉన్నప్పుడు ఖనిజాలు స్ఫటికీకరించి రాళ్లను ఏర్పరిచే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే వెనుక, వైపు, దిగువ ఉదరం లేదా గజ్జల్లో పదునైన నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో పింక్, ఎరుపు లేదా గోధుమ రక్తం వస్తుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించాలి. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.

తులసి ఆకులలో ఉండే భాగాలు యూతిక్ యాసిడ్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే, రోజుకు కనీసం 12 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు శరీరం నుండి త్వరగా బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. నిమ్మరసం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని చెప్పవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి కూడా ఇది ఎంతగానో పని చేస్తుంది. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు గుడ్లు, పెరుగు, శనగలు, చేపలు, చికెన్, పప్పులతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే, మీరు శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.