మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఆందోళన, నిద్రలేమి సమస్యకు పరిష్కారం లభించినట్లే!

ఈ ప్రకృతిలో పెరిగే దాదాపు అన్ని మొక్కల్లో మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని మన పూర్వీకులు మరియు ఆయుర్వేద నిపుణులు ఏనాడో స్పష్టం చేశారు. ఇలాంటి ఎన్నో సుగుణాలు ఉన్న కొన్ని రకాల మొక్కలు మన ఇంటి పెరట్లో మరియు ఇంట్లో పెంచుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి. వీటిని మన ఇంటి పరిసరాల్లో పెంచితే మన ఇంటి చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని, క్రిమి కీటకాలను పారదోలడమే కాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎంతో కీలకంగా మారుతాయి.

ఈరోజు మనం ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉండి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రెండు రకాల మొక్కల గురించి తెలుసుకుందాం. అరుదుగా కనిపించే అత్యంత మెడిసినల్ వాల్యూస్ కలిగి సువాసన భరితమైన మొక్క లెమన్‌ బామ్‌ ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుదీనా ఆకులను పోలి ఉండి
నిమ్మ సువాసనలు వెదజల్లుతాయి. వేసవిలో ఈ మొక్క పుష్పించి ఎంతో మధురంగా ఉంటుంది.
దోమకాటుతో వచ్చే ఔషధంలా పనిచేస్తుంది. ఈ ఆకుల కషాయంతో జలుబు, జ్వరాలు, అజీర్ణం, నరాల ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్యలు, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు వంటి అనేక రకాల సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది.

ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉండి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గడ్డి జాతి మొక్క అయిన
ఖస్‌ ఖస్‌ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.హిస్టీరియాల చికిత్సలో దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క రసంతో మొండి గాయాలను సులువుగా న్యాయం చేసుకోవచ్చు
నరాల వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.ఆర్థరైటిస్‌, కీళ్లరోగాలు, కండరాల నొప్పులు చర్మ పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కోపం, ఆందోళన వంటి లక్షణాలను తొలగించే అద్భుత ఔషధం ఈ మొక్కలో ఉంది.