సాధారణంగా అందరూ ఎంతో ఇష్టంగా ఇంట్లో మొక్కలు పెంచుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి కోసం ఇంట్లో ఇంటి పరిసర ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంట్లో ఎక్కడపడితే అక్కడ మొక్కలు పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని దిక్కులలో మాత్రమే మొక్కలు పెంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు, చెట్లు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.అందుకే చెట్లు మొక్కలు నాటే ముందు వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా వాటిని సరైనదిశలో నాటడం ఎంతో మంచిది.ఎందుకంటే ఇంట్లో మొక్కలు నాటే దిశ అనేది అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా వాస్తు దోషాలు కూడా దూరం అవుతయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో మొక్కలు నాటకూడదని నిపుణులు అంటున్నారు. ఆ దిశలలో మొక్కలు నాటితే దరిద్రాన్ని ఇంట్లోకి స్వాగతించినట్లే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు . వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏదిక్కున మొక్కలు పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం పచ్చని మొక్కలు ఇంటికి నైరుతి దిశలో అసలు పెంచకూడదు. ఈ ప్రదేశం మొక్కలను పెంచడానికి అ శుభమైనదిగా భావిస్తారు. అంతే కాకుండా ఈ దిశలో తగినంత సూర్య రష్మి ఉండదు. ఇంకా చెప్పాలంటే మొక్కలను నైరుతి దిశలో పెంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబ పెద్ద కు డబ్బు కొరత, చేపట్టిన పనులలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతేకాకుండా లోహంతో చేసిన వస్తువులు ఇంటికి తూర్పు దిక్కున అస్సలు ఉంచకూడదు. లోహపు వస్తువులను ఈ దిశలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి వ్యాపిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఈశాన్య దిశలో మొక్కలను పెంచడం అంత మంచిది కాదు. ఇంట్లో మొక్కలు పెంచాలనుకుంటే ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచటం మంచిది.