పురాతన కాలంలో వచ్చే వ్యాధులను న్యాయం చేయడానికి ఎక్కువగా ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ అడవులలో కానీ లభించి మొక్కలు వాటి ఆకుల ద్వారా వ్యాధులను నయం చేసేవారు. ఇప్పటికీ కూడా ఎన్నో రకాల మొక్కలను ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగిస్తున్నారు. ఇలా ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగించే మొక్కలలో పులి అడుగు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్కువగా అడవి ప్రాంతాలలో చెట్లకి అల్లుకొని ఉంటుంది. ఈ మొక్క విలువ తెలియని వారు ఏదో పిచ్చి మొక్క అని చాలా తేలికగా తీసి పారేస్తారు. కానీ ఈ పులి అడుగు మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు . ఈ పులి అడుగు మొక్కతో ఎన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పులి అడుగు మొక్క తీగ జాతి మొక్క. ఇది చెట్లకు అల్లుకుని పెరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో టైగర్ ఫుట్ (Tiger foot Creeper) అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా మన పూర్వీకులు కుక్క కరిచినప్పుడు ఈ ఆకులను మెత్తగా రుబ్బి కుక్క కరిచిన చోట పెట్టీ కట్టు కడతారు. అంతే కాకుండా ఈ ఆకులు రసాన్ని పిండి కుక్క కరిచిన వ్యక్తితో తాగించేవారు. అంతేకాకుండా తేలు, పాము వంటివి కరిచినప్పుడు ఈ ఆకులను మెత్తగా రుబ్బి కాటు వేసిన ప్రాంతంలో పెట్టీ కట్టు కట్టడం వల్ల విషం హరిస్తుంది. ఒక ప్రస్తుత కాలంలో అందరినీ ఎక్కువ వేధిస్తున్న సమస్యలలో కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. ఇలా ఇలా నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ ఆకుల పేస్ట్ పెట్టి కట్టుకట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మగవారిని వేధిస్తున్న ఫైల్స్ సమస్యకు ఈ మొక్క మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఫైల్స్ సమస్యతో బాధపడే వారు ఈ ఆకులను మెత్తగా రుబ్బి ఫైల్స్ ఉన్న ప్రదేశంలో ఈ పేస్టుని పెట్టడం వల్ల క్రమంగా వారి సమస్య తగ్గుముఖం పడుతుంది. గజ్జి, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలను న్యాయం చేయడంలో కూడా ఈ ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ఆకుల రసం మొటిమలు సమస్యను కూడా దూరం చేస్తుంది. జ్వరం ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా రుబ్బి ఆ పేస్ట్ ని శరీరానికి అంటించి కొంత సమయం తర్వాత గోరువెచ్చ నీటితో స్నానం చేయడం వల్ల జ్వరం తగ్గి నొప్పుల నుండి విముక్తి కలుగుతుంది.