కోడిగుడ్డు తిన్న తర్వాత మీరు ఈ పదార్థాలు తింటున్నారా… మీరు ప్రమాదంలో పడినట్టే!

కరోనా వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా పోషక విలువలు కలిగిన వాటిలో గుడ్డు ఒకటి. ప్రతి రోజు గుడ్డు తినటం వల్ల పెద్దవారి నుంచి మొదలుకొని పిల్లల వరుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గుడ్డు తిన్న తరువాత కొన్ని పదార్థాలు తినడం ప్రమాదం మరి గుడ్డు తిన్న తరువాత ఎలాంటి పదార్థాలు తినకూడదు అనే విషయానికి వస్తే..

కోడి గుడ్డు తిన్న తర్వాత పాలు, పెరుగు, జున్ను, చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కోడి గుడ్డు తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలలో ఏ ఒక్కటి కూడా వెంటనే తీసుకున్న మన శరీరంలో జీర్ణ సమస్యలు ఎదురు పడుతుంది. అలాగే కోడిగుడ్డును తీసుకున్న తర్వాత తేనె నెయ్యి వంటి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది కాదు. వీటితో పాలు, అరటిపండు వంటి ఆహారా పదార్ధాలు తీసుకుంటే అనేక జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ గుడ్డు తిన్న తర్వాత ఇలాంటి పదార్థాలను తినాలి అనుకుంటే ఒక గంట సమయమైన గ్యాప్ ఇవ్వాలి. ఇక కోడి గుడ్డును తిన్న తరువాత ద్రాక్ష, పుచ్చకాయ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది కాదు. అంతేకాకుండా ఈ గుడ్డు తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది కాదు అని తెలుస్తుంది. అందుకే గుడ్డు తిన్న తర్వాత ఈ వెంటనే ఈ ఆహార పదార్థాలను తిరగపోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.