యుక్త వయస్సులోనే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

itchyscalpihair-25-1508934669-1572415420

సాధారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు అసలు కారణాన్ని గ్రహించకుండా మార్కెట్లో దొరికే అన్ని రకాల సబ్బులు షాంపులను ఉపయోగించి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మనలో పోషకాహార లోపం తలెత్తడమే అన్నది మొదట గ్రహించాలి. ముఖ్యంగా మనలో ప్రోటీన్స్ లోపం తలెత్తితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు యుక్త వయస్సులోనే జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, సహజ మృదుత్వాన్ని కోల్పోయి అందవిహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

మనలో ప్రోటీన్స్ లోపాన్ని సవరించుకోవడానికి తరచూ మన ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, పాలకూర, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.మన శరీరంలో ఐరన్ , బి12 వంటి పోషకాలు లోపిస్తే రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలు తలెత్తి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగా అందక జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున విటమిన్ సి, ఐరన్, ఫోలిక్, జింక్ మూలకాలు సమృద్ధిగా లభించే నారింజ, బత్తాయి, కివి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పండ్ల రసాలను కూడా సేవించవచ్చు.

మనలో విటమిన్ ఈ,బయోటిన్ లోపిస్తే జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ లోపాన్ని సవరించుకోవడానికి విటమిన్ ఈ , బయోటిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు, చేపలు, బీన్స్ ,పల్లీలు, సముద్రపు చేపలు, గుడ్లు వంటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొబ్బరి నూనెలు రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపి తలకు మర్దన చేసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది.