శని ఈతి బాధల నుంచి తప్పించుకోవాలంటే శివరాత్రి రోజు శివలింగానికి వీటిని సమర్పిస్తే చాలు!

Saturday Fasting

హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో శివరాత్రి ఒకటి ఈ పండుగను ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం లోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 మహా శివరాత్రి వేడుకలు భక్తులు ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.ఇలా మహాశివరాత్రి పండుగ సమీపిస్తున్న తరుణంలో పరమేశ్వరుడికి ఏ విధంగా పూజ చేయాలి ఎలా ఉపవాస జాగరణ చేయాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారు చేసే కర్మలకు తగిన ఫలితాలను శనీశ్వరుడు అందిస్తూ ఉంటారు ఇలా శనీశ్వరుడి ప్రభావం కారణంగా చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే శని బాధలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలంటే శివరాత్రి రోజు శనీశ్వరునికి వీటిని సమర్పిస్తే చాలు. శివరాత్రి రోజు స్వామివారికి గంగాజలం సమర్పించడం వల్ల శని ప్రభావ దోషం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక శివలింగానికి పాలు పెరుగును కూడా సమర్పించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.

శనీశ్వరుడి ఆగ్రహం వల్ల వారి జీవితం కష్టనష్టాలతో నిండిపోయి, ఆనందం కరువైపోతే అలాంటి వారు మహా శివరాత్రి రోజున శివలింగానికి దేశీ నెయ్యిని సమర్పించడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి.శని ప్రభావాన్ని నివారించడానికి మహాశివరాత్రి రోజు శివలింగానికి తేనెను సమర్పిస్తే అంతా మంచే జరుగుతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు