ప్రతిరోజు ఈ లడ్డూలు తింటే షుగర్ వ్యాధి పరార్.. ఈజీగా చక్కెర వ్యాధికి చెక్ పెట్టవచ్చు!

క్రమ పద్ధతి లేని జీవన విధానంతో రోజురోజుకు షుగర్ వ్యాధితో బాధపడేవారు సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి పనితీరులో వ్యత్యాసం ఏర్పడితే షుగర్ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకసారి షుగర్ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఈ వ్యాధితో పోరాడాల్సిందే ఈ వ్యాధి నియంత్రించుకోవడం తప్ప పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఆహారంలో ఏది తీసుకోవాలన్న సంకోచిస్తుంటారు. ముఖ్యంగా స్వీట్లు తినాలన్న ఆశ ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్యంగా తినలేని పరిస్థితి షుగర్ వ్యాధిగ్రస్తులది. ఇప్పుడు చెప్పబోయే లడ్డు ప్రతిరోజు తింటే షుగర్ వ్యాధి మన కంట్రోల్ లో ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే పనస పండు లడ్డు . ఈ లడ్డును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దీన్ని ఎలా తయారు చేయాలి వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అత్యధిక పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పనస పండు లడ్డూను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే పనస పండులో సమృద్ధిగా లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి షుగర్ వ్యాధిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుతుంది.

పనస పండు లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పనస పండును చిన్న చిన్న ముక్కలుగా తరిగి మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నెయ్యి , బెల్లం వేసి చిన్న మంటపై పాకం వచ్చేంతవరకు వేడి చేయాలి.
తర్వాత బెల్లం పాకంలో ముందుగా తయారు చేసుకున్న పనస మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడిని వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత రెండు కప్పుల స్వీటెనర్, ఆలివ్ నూనె వేసి కొద్దిసేపటి తర్వాత మంటను పూర్తిగా ఆపేసి చల్లారిన తర్వాత పనసపండు లడ్డు మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకుని దానిపై బాదం పప్పుతో గార్నిష్ వేసుకుంటే రుచికరమైన పనస పండు లడ్డూలు తయారైనట్లే. ఈ పనస పండు లడ్డూలను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే షుగర్ వ్యాధినీ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. దాంతోపాటే ఉదయం, సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, ధ్యానం, వంటి అలవాట్లను అలవర్చుకుంటే సరిపోతుంది.