వర్షాకాలంలో ఈ టీ తాగితే చాలు శరీరానికి కావలసిన ఇమ్మునిటీ పవర్ మీ సొంతం…?

వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలను వెంట తీసుకుని వస్తుంది. వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ వర్షాకాలంలో ఇలాంటీ వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణం శరీరంలో ఇమ్మునిటి పవర్ లోపించటం. సహజంగా వర్షాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అందువల్ల ఈ సీజనల్ వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందుతాయి. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఇటువంటి సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండటానికి ఒక్క టీ తాగితే చాలు. ఈ టీ తాగటం వల్ల శరీరంలో ఇమ్మూనిటీ పవర్ పెంపొందించి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ టీ ఏంటో తెలుసుకుందాం.

మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకునె ఈ టీ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. ఈ టీ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఈ సూపర్ టీ తయారు చేయటానికి రెండు ఉసిరి కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి గింజ తొలగించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచం అల్లం ముక్కను తీసుకుని తొక్క తొలగించి నీటిలో కడిగి కచ్చ పచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి బాగా మరిగించాలి. మీరు బాగా ఉడికేటప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, ఉసిరికాయ ముక్కలు ఆ నీటిలో వేసి బాగా మరిగించాలి.

గిన్నెలో ఉన్న నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని ఒక గ్లాస్ లో వడపోయాలి. ఇప్పుడూ ఈ గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఇలా చక్కటి రుచిని కలిగి ఉండే ఈ టీని ప్రతి రోజు ఉదయాన్నే ఒక కప్పు తాగటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ అల్లం – ఆమ్లా టీ తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి వేగంగా విముక్తి పొందవచ్చు. అంతే కాకుండ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగటం వల్ల డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తెరిచేరకుండా ఉంటాయి. అంతే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.