ప్రతిరోజు ఈ మిల్క్ తాగితే కొలెస్ట్రాల్ వెన్నపూసల కరగడం కాయం?

సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో డ్రై ఫ్రూట్స్ ముందు వరుసలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్ రుచికి కొద్దిగా వగరు ఉండడంతో దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇలాంటివారు వాల్ నట్స్ ను మిల్క్ రూపంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయని న్యూట్రిషన్ నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక శరీర బరువు సమస్యతో సతమతమవుతున్న వారికి వాల్నట్ మిల్క్ దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో వాల్నట్ మిల్క్ చిన్న బాటిల్స్ లో లభ్యమవుతుంది. అలా కాకుండా మీరే తయారు చేసుకోవాలంటే ముందుగా 15 వాల్నట్స్ కు సరిపడా బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. వాల్ నట్స్ మెత్తగా నానిన తర్వాత వాటర్ తో సహా మిక్సీలో వేసుకుని మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. వచ్చిన మిశ్రమాన్ని వడగట్టుకుంటే వాల్నట్ మిల్క్ సిద్ధమైనట్లే. ఇందులోకి సరిపడా తేనెను కలుపుకొని వారంలో మూడుసార్లు కచ్చితంగా తాగితే శరీర బరువును, చెడు కొలెస్ట్రాల్ ను సహజ పద్ధతుల్లో నియంత్రించుకోవడంతోపాటు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్నట్ లో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్, విటమిన్స్ మన జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించి మనలో వ్యాధి నిరోధక శక్తిని, కండరాలను, నరాలను, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ వెన్నపూసలా కరిగి శరీర బరువు తొందరగా నియంత్రించబడుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచి మానసిక ఒత్తిడిని నిద్రలేమి సమస్యను దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. శరీరంపై వచ్చే ముడతలు,వృద్ధాప్య ఛాయాలను తొలగించి నిత్య యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ముప్పును తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.