ఈ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది తీవ్రమైన ఫ్లూ, ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. దానికి తోడు కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండడంతో మనల్ని కలవరపాడుకు గురిచేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సహజ ఔషధ గుణాలు ఉన్న బిర్యాని ఆకులను ఉపయోగించవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం బిర్యాని ఆకుల్లో సమృద్ధిగా మిటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియన్ లక్షణాలు ఉన్నందున మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్లు, అలర్జీ సమస్యల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం బిర్యానీ ఆకులను తగినన్ని నీళ్లలో వేసుకుని బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని ఈ శీతాకాలంలో ప్రతిరోజు అల్పాహారానికి ముందే సేవిస్తే సరిపోతుంది. ఇంకా ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం, పుదీనా తులసి వంటి వాటిని కూడా వేసుకోవచ్చు.
శీతాకాలంలో ఎక్కువ మందిని వేధించే శ్వాస సంబంధిత సమస్యలైన జలుబు, సైనస్, బ్రాంకైటిస్, న్యుమోనియా ఉబ్బసం వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో బిర్యానీ ఆకుల కషాయం అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్, మలబద్ధక సమస్యలను తొలగించి జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. ఈ మధ్యకాలంలో బిర్యాని ఆకుల ఔషధాలను క్యాప్సిల్స్ రూపంలో కూడా లభ్యమవుతున్నాయి. వీటిని ఉపయోగించి లేదా బిర్యానీ ఆకుల కషాయాన్ని సేవించిన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు క్రమబద్ధీకరించి డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
సాధారణంగా శీతాకాలంలో రక్తప్రసరణ తగ్గి గుండె పనితీరు మందగిస్తుంది. ఈ సమస్యని అధిగమించడానికి బిర్యానీ ఆకుల కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, కెఫిన్ సమ్మేళనాలు గుండె హార్ట్ బీట్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.