తెల్ల జుట్టు నల్లబడటం కోసం తరచూ హెయిర్ డై వాడుతున్నారా… హెయిర్ డైకు గుడ్ బై చెప్పేయండి?

ప్రస్తుత కాలంలో మన ఆహారంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే పోషకాలు మన శరీరానికి చాలా తక్కువ స్థాయిలో అందటం వల్ల చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా వెంట్రుకలు తెల్లబడటం జరుగుతుంది. ఇలా పోషకాల లోపంతోనూ అదే విధంగా వాతావరణ కాలుష్యం షాంపూల కారణంగా కూడా జుట్టు తొందరగా తెల్లబడటం జరుగుతుంది. అయితే ఇలా తెల్లబడిన జుట్టు వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ తరచూ హెయిర్ డై వాడుతూ ఉన్నారు ఇలా తరచూ హెయిర్ డై వాడడం వల్ల జుట్టు నల్లగా ఉన్నప్పటికీ ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతుంటాయి.

తలలో చుండ్రు ఏర్పడటం అలర్జీ రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఇకపై తెల్లని చుట్టూ నల్లబడటానికి హెయిర్ డైకి బదులుగా ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ చిట్కాన్ని పాటించడం వల్ల తెల్ల వెంట్రుకలు మొత్తం నల్లగా మారిపోయి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. మరి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటం కోసం ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి…

ముందుగా రెండు పెద్ద బొప్పాయి ఆకులు తీసుకోవాలి అలాగే ఐదు బిర్యానీ ఆకులు ఐదు లవంగాలు, టీ స్పూన్ కాఫీ పౌడర్ తగినంత హెన్నా. ముందుగా బొప్పాయి ఆకులను మెత్తని మిశ్రమంలో చేసి వాటిని వడపోసుకోవాలి. మరో గిన్నెలో బిర్యానీ ఆకులు లవంగాలు, టీస్పూన్ కాఫీ పౌడర్ వేసి ఒక గ్లాసు నీటినీ పోసి బాగా మరిగించాలి. ఇలా గ్లాస్ నీళ్లు అర గ్లాసు వచ్చేవరకు మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా బొప్పాయి రసం లోకి వడపోసుకోవాలి.ఇక ఇందులో మన జుట్టుకు తగినంత హెన్నా వేసి మెత్తని మిశ్రమంలో కలిపి ఓ 5 గంటల పాటు మూసి పెట్టాలి ఐదు గంటల తర్వాత తలకుదుళ్లకు బాగా అంటేలా రాసి అనంతరం స్నానం చేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు మొత్తం నల్లబడుతుంది.