సాధారణంగా కొబ్బరి నీళ్లను తాగితే దాహం మాత్రమే తీరుతుంది అని అనుకుంటున్నారు. అది పొరపాటు ఆలోచన కొబ్బరి నీళ్లను తాగితే దాహం తీరడంతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్ ,మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ను అందించడంతోపాటు ఈ వేసవికాలంలో శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించి ఎల్లప్పుడూ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి సీజన్లు శరీరం తొందరగా అలసిపోయి నీరసం,ఒత్తిడి, చికాకు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.
కొబ్బరి నీటిలో అత్యధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, సోడియం, కాల్షియం వంటి మినరల్స్ నిత్య జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.ఇందులోని ఎలక్ట్రోలైట్స్ తక్షణ శక్తిని అందించి డిహైడ్రేషన్ సమస్య వల్ల మందగించిన అవయవాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. రక్తపోటు సమస్య తొలగిపోతుంది, మెదడు కణాలు అభివృద్ధి జరిగి మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.
చిన్నపిల్లలతో ప్రతిరోజు గ్లాసుడు కొబ్బరి నీళ్లను తాగిస్తే శరీర అవసరాలకు సరిపడా గ్లూకోస్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభించి తొందరగా అలసిపోనివ్వదు. అతి బరువు సమస్యతో బాధపడేవారు తరచు తక్కువ కొవ్వులు ఉండే కొబ్బరినీళ్లను రోజూ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లుల తరచూ కొబ్బరినీళ్లను సేవిస్తే ఇందులో ఉండే పోషకాలు గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు లారిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేయడం వల్ల తల్లిపాలు సమృద్ధిగా పడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తరచూ కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, చర్మాన్ని పొడి వారనివ్వకుండా రక్షించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.