కర్పూరంతో ఇలా చేస్తే చిటికెలో ఈ సమస్యలన్నీ మటుమాయం?

సాధారణంగా కర్పూరం ను పూజా కార్యక్రమాల్లో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సువాసన భరితమైన కర్పూరం లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు
ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల మొండి వ్యాధులను నయం చేయడానికి కర్పూరాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కర్పూరం నూనెను ఉపయోగించి ఎలాంటి సమస్యలను నయం చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

కర్పూరంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున కర్పూర మిశ్రమాన్ని గోరువెచ్చని ఆవాల నూనెలో కలిపి మర్దన చేసుకుంటే జలుబు, దగ్గు వంటి ఫ్లూ లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూర మిశ్రమాన్ని కలిపి చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు గుణాలు పొడిబారిన చర్మాన్ని సరి చేయడమే కాకుండా చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.

చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూర మిశ్రమాన్ని కలిపి తల చర్మానికి అంటే విధంగా రాసుకుంటే ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యకు చక్కని పరిష్కార మార్గం చూపడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. తరచూ తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు శొంఠి, అర్జున బెరడు, తెల్ల చందనంతో కలిపి కర్పూరం రాసుకుంటే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది

కీళ్ల నొప్పులు, కీళ్లవాపు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు కర్పూర మిశ్రమాన్ని లేపనంగా ఉపయోగిస్తే తీవ్రమైన నొప్పి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు , ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు సహజ పద్ధతిలో తొలగిపోతాయి. మొండి గాయాలను నయం చేయడంలో కర్పూరం ఎంతగానో తోడ్పడుతుంది.